నిధి అగర్వాల్ : ఒకే సంవత్సరం ఇద్దరు స్టార్స్.. ఈ దెబ్బతో బ్యూటీ కెరీర్ మారనుందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలో నీది అగర్వాల్ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో భారీగానే అవకాశాలు వచ్చాయి.

ఇకపోతే ఈమె ఇప్పటివరకు చాలా తెలుగు సినిమాల్లో నటించిన ఈమెకు కమర్షియల్ గా మాత్రం అద్భుతమైన విజయం ఇప్పటివరకు దక్కలేదు. ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం నటిస్తున్న ఓ రెండు భారీ చిత్రాలు వచ్చే సంవత్సరం విడుదల కానున్నాయి. ఆ సినిమాలు మంచి విజయాలు సాధిస్తే ఈ నటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పొందుతున్న హరిహర వీరమల్లు , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఈ రెండు మూవీలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

మరి భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాలు కనుక మంచి విజయాలను అందుకున్నట్లయితే ఈ రెండు సినిమాల ద్వారా నీది అగర్వాల్ క్రేజ్ మరింతగా పెరిగి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని , అలాగే ఈ బ్యూటీ కి అనేక క్రేజీ సినిమాలలో అవకాశాలు కూడా దక్కే ఛాన్స్ ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ రెండు సినిమాలతో నిధి అగర్వాల్ ఎలాంటి విజయాలను అందుకొని ఏ స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: