మరో వివాదంలో మంచు విష్ణు..ఈ సారి అడవి పందులను పట్టుకుని ?

Veldandi Saikiran
మంచు కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే మంచు మోహన్ బాబు కారణంగా... ఆ కుటుంబ సభ్యులు.. బయట తిరగని పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో హీరో మంచి విష్ణు సిబ్బంది... మరో వివాదానికి తెర లేపారు. తాజాగా అడవిపందులను... వేటాడి మరి ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లారు మంచు  విష్ణు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం మంచు విష్ణు ఫ్యామిలీ మొత్తం జల్పల్లిలో ఉన్న ఫార్మ్ హౌస్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మంచు విష్ణుకు సంబంధించిన సిబ్బంది ఓ వివాదానికి తెర లేపారు. జల్ పల్లి పరిధి దగ్గర ఉన్న అడవిలో అడవి పందులను వేటాడి... రచ్చ చేసింది మంచు విష్ణు సిబ్బంది. అడవి పందులను వేటాడి... మంచి విష్ణు ఫామ్ హౌస్ కు తీసుకువచ్చారు ఆయన మేనేజర్ కిరణ్ అలాగే సిబ్బంది. వేటాడిన అడవి పందులను భుజాలపై... ఎత్తుకొని మరి మంచి విష్ణు సిబ్బంది... తీసుకొస్తున్న వీడియో వైరల్ గా మారింది.
ఇక ఈ అడవి పందులను వేటాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి పందులను వేటాడడం నేరమని తెలియదా? ఒక స్టార్ హీరో.. అయి ఉండి అడవి పందులను వేటాడమని ప్రోత్సహిస్తాడా...? అంటూ మండిపడుతున్నారు. వెంటనే మంచు కుటుంబం పైన చర్యలు తీసుకోవాలని... డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్.

అయితే అడవి పందులను వేటాడిన వీడియో వైరల్ కావడంతో... అధికారులు కూడా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు మొదట స్పందించే ఛాన్స్ ఉంది. నిజంగా ఇది మంచు విష్ణుకు సంబంధించిన సిబ్బంది చేసిన పని అయితే కచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఈ అడవి పందుల సంఘటనపై మంచు విష్ణు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: