ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ ఎంపిగా బిజీబిజీ..?
తన సొంత సొంత రాష్ట్రానికి వెళ్లిపోయి సినిమాలు , సీరియల్స్ తో బిజీబిజీగా మారిపోయింది .. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు అమ్మగా మారింది .. సాధారణంగా ఒకప్పటి హీరోయిన్లు తల్లైన తర్వాత సినిమాలు సీరియల్స్ తగ్గిస్తారు .. కానీ ఈ అందాల ముద్దుగుమ్మ మాత్రం మరింత స్పీడ్ పెంచింది .. రియాల్టీ షోలు టీవీ షోస్ తో బెంగాలీ ప్రేక్షకులకు బాగా పాపులర్ నటిగా మారిపోయింది .. అలా వచ్చిన క్రెజ్ తో ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది .. అలాగే తన చరిష్మా తన ప్రత్యేక అభ్యర్థిపై ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం అందుకుంది. ప్రస్తుతం ఎంపీగా ప్రజాసేవలో బిజీబిజీగా ఉంటున్న ఈ అందాల ముద్దుగుమ్మ మరెవరో కాదు రచనా ఛటర్జీ .. ఇంతకీ ఆమె ఎవరంటే బావగారు బాగున్నారా సినిమాలో సెకండ్ హీరోయిన్.
వెస్ట్ బెంగాల్ కు చెందిన రచనా తెలుగులో పిల్ల నచ్చింది, కన్యాదానం, పవిత్ర ప్రేమ, సుల్తాన్, రాయుడు, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా మెరిసింది. కాగా 2002 లో వచ్చిన లాహిరి లాహిరి సినిమా తర్వాత మరి ఏ తెలుగు సినిమాలోను నటించలేదు ఈ అందాల ముద్దుగుమ్మ .. కానీ తన సొంత రాష్ట్రంలో మాత్రం వరస సినిమాలు టీవీ షోలు తో బిజీగా మారిపోయింది. ఇదే క్రమంలో దీదీ నెంబర్ వన్ అనే టీవీ షో తో వెస్ట్ బెంగాల్లో భారీ క్రేజ్ తెచ్చుకుంది రచనా .. ఇదే క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ చేరి రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి.. ఆ వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో హూగ్లీ పార్లమెంట్ నుంచి బర్లోకి దిగి .. తనకొచ్చిన క్రేజ్ చరిష్మాతో బిజెపి అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీపై ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఇలా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ స్టార్ గా మారిపోయింది.