"అలా చేస్తే ఒక్కొక్కడికి తాట తీసేస్తా".. రామ్ చరణ్ స్ట్రైట్ మాస్ వార్నింగ్..ఏమైందంటే..?

Thota Jaya Madhuri
రామ్ చరణ్ .. ఈ పేరు ఇప్పుడు గ్లోబల్ స్ధాయిలో ట్రెండ్ అవుతుంది. చరణ్ మంచితనం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అభిమానులు పట్ల ఎంత రెస్పెక్ట్ ఫుల్ గా ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా ఎవరైనా ఫ్యాన్స్ గొడవ పడుతూ ఉన్న.. వేరే హీరోల ఫ్యాన్స్ తగాదా పడుతున్న ..స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తూ ఉంటాడు . తన ఫ్యాన్స్ ని కంట్రోల్ గా ఉండాలి అంటూ పద్ధతిగా బిహేవ్ చేయాలి అంటూ ఎప్పటికప్పుడు ఈవెంట్స్ లో చెప్తూనే ఉంటారు .


మరి ముఖ్యంగా సెల్ఫీలు అంటూ వచ్చిన వారిని తోసేయకుండా బౌన్సర్ల చేత నెట్టించేయకుండా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఉంటాడు . అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు అభిమానులకి స్ప్రైట్ వార్నింగ్ ఇచ్చాడు అన్న వార్త సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం పుష్ప2 సినిమా చూడడానికి సంధ్యా థియేటర్ కి వచ్చిన ఫాన్స్ చేసిన హంగామానే అంటూ తెలుస్తుంది . అల్లు అర్జున్ జీవితంలోనే  ఈ సంధ్య థియేటర్ ఇష్యూ ని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మార్చేశారు ఫాన్స్ .


అయితే త్వరలోనే "గేమ్ చేంజర్" సినిమా రిలీజ్ అయిపోతుంది. జనవరి 10వ తేదీ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది . అయితే ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్యాన్స్ ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఎక్కడ ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి ఇబ్బందులు కలగకుండా ఉండేలా రామ్ చరణ్ స్పెషల్ గా ఏరియాల వారి తన ఫ్యాన్స్ టీం తో అందరితోనూ విర్చువల్ గా మాట్లాడారట . ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫాన్స్ జాగ్రత్తగా ఉండాలి అని.. అరుపులతో కేకలతో పక్క హీరోల ఫ్యాన్స్ ని హర్ట్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ రిక్వెస్ట్ చేశారట . "ఎవరైనా సరే తాగి తందనాలు ఆడినా.. ఆడపిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించి తొక్కిసలాట జరుపుకున్న తాట తీసేస్తాను "అంటూ స్ట్రైట్ వార్నింగ్ కూడా ఇచ్చారట . ఇదే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: