చిరు నా సినిమాను ఓకే చేయడానికి అంత సమయం తీసుకున్నాడు.. శ్రీకాంత్ ఓదెల..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా త్రిష నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మొదట వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మే 5 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే చిరంజీవి తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా చిరంజీవి గురించి , ఆయనతో సినిమా ఓకే కావడం గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను ఈయన తెలియజేశాడు. శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... చిరంజీవి గారు గొప్ప వ్యక్తి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.

ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక చిరంజీవి గారికి కథ చెప్పిన తర్వాత కేవలం 48 గంటల్లోనే సినిమా ఓకే అయ్యింది అని శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. నాని హీరోగా రూపొందిన దసరా సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన శ్రీకాంత్ ప్రస్తుతం శ్రీ నాని హీరోగా ప్యారడైజ్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ తర్వాత చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: