సినిమా ఇండస్ట్రీలో ఓ కాంబోలో అద్భుతమైన విజయం వచ్చింది అంటే మరోసారి వారి కాంబోలో మరో సినిమా వస్తుంది అంటే దానిపై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి కాంబోస్ చాలానే వచ్చే సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలో రిపీట్ అవ్వబోతున్నాయి ఆ క్రేజీ కాంబోస్ ఏవో తెలుసుకుందాం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో మరో మూవీ కూడా రూపొందబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. చరణ్ , సుకుమార్ కాంబో మూవీ 2025 వ సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన కాంబోలలో బాలకృష్ణ , బోయపాటి కాంబో ఒకటి. వీరి కాంబినేషన్లో సింహ , లెజెండ్ , అఖండ అనే సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. వీరి కాంబోలో అఖండ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ రూపొందబోతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి , అలా వైకుంఠపురంలో అనే మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. వీరి కాంబినేషన్లో నాలుగవ సినిమా కూడా స్టార్ట్ కాబోతుంది. దీనిని వచ్చే సంవత్సరం స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నిఖిల్ , చందు మండేటి కాంబినేషన్లో కార్తికేయ 1 , కార్తికేయ 2 అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండు మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. వీరి కాంబినేషన్లో కార్తికేయ 3 అనే సినిమా వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
గోపీచంద్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో గోలీమార్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే వీరి కాంబినేషన్లో నెక్స్ట్ ఈయర్ మరో మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.