తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దివ్య వాణి ఒకరు. ఈమె తెలుగులో చాలా విజయవంతమైన సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఈమె ఎక్కువ శాతం రాజేంద్రప్రసాద్ హీరోగా రూపొందిన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. వీరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే దివ్య వాణి , రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో చాలా శాతం సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో వీరి కాంబోకు కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉండేవి.
దానితో రాజేంద్ర ప్రసాద్ , దివ్య వాణి కాంబోలో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాపై ఆసక్తిని చూపించే స్థాయికి వీరి కాంబో చేరిపోయింది. కానీ స్వయంగా రాజేంద్రప్రసాద్ ఓ సినిమాలో దివ్య వాణి ని వద్దు అని చెప్పి వేరే అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుందాం అని ఓ సినిమా విషయంలో అన్నాడట. దానితో దర్శకుడు కూడా ఏమీ చేయలేక దివ్య వాణి ని పక్కన పెట్టి వేరే బ్యూటీ తో సినిమాను చేశారట. ఈ విషయాన్ని దివ్య వాణి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా దివ్య వాణి మాట్లాడుతూ ... బాపు గారి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా రూపొందిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నన్ను మొదటగా బాపు గారు హీరోయిన్గా తీసుకోవాలి అనుకున్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం అందుకు అంగీకరించలేదు.
బాపు గారు ఎంత ప్రయత్నించిన ఆయన అంగీకరించకపోవడంతో ఆమని ని ఆ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక నాకు ఆ సినిమాలో అవకాశం రాకపోయినా ఆమని కి ఆ సినిమా ద్వారా మంచి విజయం , మంచి గుర్తింపు వచ్చింది. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని దివ్య వాణి ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.