ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి చాలా మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతుంటే ఎక్కువ శాతం మంది తక్కువ సినిమాలతోనే ఇండస్ట్రీ కి దూరం అవుతున్నారు. ఇది ఇలా ఉంటే చాలా తక్కువ సినిమాలతోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు అనేక మంది ఉన్నారు. పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్గా నటించి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ సినిమాలకు దూరం అయింది. మళ్ళీ తిరిగి ఓ చిన్న సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఆ మూవీ తో ఈమెకు మంచి విజయం దక్కింది. ఇంతకు ఆ డ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి నివేత థామస్. ఈ ముద్దుగుమ్మ జెంటిల్ మేన్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన జై లవకుశ అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొంత కాలం వరకు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దు గుమ్మ 35 చిన్న కథ కాదు అనే సినిమాతో తిరిగి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.