త్రిష : 2024 నిల్.. ఏమైంది బ్యూటీకి.. ఎందుకీ నిర్లక్ష్యం..?

Pulgam Srinivas
తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో త్రిష ఒకరు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటికి కూడా అద్భుతమైన దశలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే తమిళ ఇండస్ట్రీపై ఎక్కువగా ఫోకస్ను పెట్టింది. అందులో భాగంగా ఈమెకు తమిళ్లో మంచి అవకాశాలు రావడం వల్ల ఈమెకు ఇప్పటికీ కూడా తమిళ్లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఇకపోతే తెలుగులో ఈమె అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈమె చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ సంవత్సరం మాత్రం ఒక్క మూవీతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. పోయిన సంవత్సరం ఈ బ్యూటీ నటించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 , ది రోడ్ , లియో అనే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో మంచి అంచనాల నడుమ విడుదల అయిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే ది రోడ్ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేదు. ఇక లియో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ సంవత్సరం మాత్రం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సంవత్సరం ఈ బ్యూటీ బ్రింద అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే అద్భుతమైన క్రేజ్ ఉన్నా కూడా ఈ నటి నటించిన ఏ సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల కాలేదు.

కానీ వచ్చే సంవత్సరం మాత్రం ఈమె నటించిన అనేక సినిమాలు విడుదల కానున్నాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ బ్యూటీ నటించిన విడముయర్చి అనే సినిమా విడుదల కానుంది. అలాగే ఈ నటి ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: