2025 క్రేజీ సినిమాలు: టిల్లు గాడి కెరీర్ డిసైడ్ చేయనున్న జాక్!

MADDIBOINA AJAY KUMAR
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నల గడ్డ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టిల్లు స్క్వేర్ సినిమాతో ఈ యంగ్ హీరో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. డీజే టిల్లు సినిమాతో ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేశాడు. ఎంతోమంది యూత్, మాస్ ఆడియెన్స్‌లో క్రేజీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం మరో మంచి ఎంటర్టైనింగ్ సినిమాతో స్టార్ బాయ్ సిద్ధూ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
సిద్ధూ జొన్నల గడ్డ హీరోగా తెరకెక్కనున్న చిత్రం జాక్. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతొంది. జాక్ మూవీకి 'కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బివిఎస్ఎన్‌ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. జాక్ మూవీలో స్టార్ బాయ్ కి జోడీగా బేబీ మూవీతో ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య నటిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యిందని సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్రల్లో ప్ర‌కాష్ రాజ్‌, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు కనిపించనున్నారు. అయితే ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మూవీ డేట్ ని కూడా రిలీజ్ చేశారు. సమ్మర్ కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న జాక్ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. వినోదాత్మకంగా రాబోతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ ని ప్రారంభించనుంది. అయితే ఈ చిత్రంలో సిద్ధూ జొన్నల గడ్డ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే ఈ సినిమా 2025 క్రేజీ సినిమాల లిస్ట్ లో ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రేక్షకులకు టిల్లు గాడి మీద అంచనాలు పెరిగిపోయాయి.. ఇక జాక్ మూవీ అంచనాలను మించి ఉంటుందో, లేదో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: