విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి బీమ్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను అనిల్ రావిపూడి కొన్ని రోజుల క్రితమే మొదలు పెట్టాడు. జెట్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సంక్రాంతి కి విడుదల చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు ఈ సంవత్సరం సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , బాలయ్య హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలు షూటింగులు చాలా రోజుల క్రితం ప్రారంభం అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ను కొన్ని రోజుల క్రితం మొదలు పెట్టి ఫుల్ స్పీడ్ గా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసిన అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను కూడా అద్భుతమైన స్థాయిలో చేస్తూ వస్తున్నాడు.
ఇక ఎప్పుడో మొదలు పెట్టిన గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ సినిమాలకు సంబంధించిన పబ్లిసిటీలు మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా స్థాయిలో జరగడం లేదు. దానితో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి ని చూసి గేమ్ చేంజర్ మూవీ దర్శకుడు అయినటువంటి శంకర్ , డాకు మహారాజ్ సినిమా దర్శకుడు అయినటువంటి బాబి చాలా నేర్చుకోవాలి అని , ఆయనలా సినిమాను స్పీడుగా పూర్తి చేసి పబ్లిసిటీని ఫుల్ గా చేయాలి అని చరణ్ , బాలయ్య అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.