టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క టేకులో ఎలాంటి సీనైనా అలాగే ఎలాంటి డాన్స్ అయినా చేయగల సమర్ధుడు నందమూరి బాలయ్య. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు నందమూరి బాలయ్య. అయితే ఆయన ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. సీనియర్.. హీరోలలో నందమూరి బాలయ్య ఒకరు.
అలాంటి నందమూరి బాలయ్య ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతికి డాకు మహారాజు సినిమాతో రాబోతున్నాడు నందమూరి బాలయ్య. ఈ డాకు మహారాజు సినిమా... మా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ అలాగే సాంగ్స్ అన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయి. చిత్ర బృందం ప్రమోషన్ మూడ్లోకి వెళ్ళింది.
ఈ సినిమాకు బాబి దర్శకత్వం అలాగే రచన కూడా అతనే కావడం విశేషం. స్క్రీన్ పై చక్రవర్తి రెడ్డి నిర్వహిస్తుండగా సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో దాదాపు నలుగురు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్ర పోషించబోతున్నారని సమాచారం. ఆమె మెయిన్ హీరోయిన్ అంటున్నారు. ఇక శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశీ ఇలాంటి బ్యూటీ లు ఇందులో కనిపించనున్నారు.
ఈ సినిమాలో బాబి డియోల్ విలన్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్....బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య అలాగే తనకు మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంటుందని తెలిపారు. మా కాంబినేషన్ రియల్ ఛాంపియన్... అంటూ వ్యాఖ్యానించారు. మా కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుతుందని ఆమె చెప్పకనే చెప్పారు. ఇక డాకు మహారాజులో బాలయ్య పాత్ర అద్భుతంగా ఉంటుందని కొనియాడారు ప్రగ్యా జైస్వాల్.