ఉదయ్ కిరణ్ మృతిపై టాలీవుడ్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు ?

Veldandi Saikiran
ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో లవర్ బాయ్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన ఉదయ్ కిరణ్ అకస్మాత్తుగా మరణించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప హీరో అవుతాడని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఊహించని విధంగా అతని మరణం తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. చిత్రం అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 


ఆ సినిమా తర్వాత మరోసారి తేజ దర్శకత్వంలో నువ్వు నేను సినిమా చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. నువ్వు నేను సినిమా అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా అనంతరం ఉదయ్ కిరణ్ వరుసగా ప్రేమ కథ చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మనసంతా నువ్వే సినిమాలో హీరోగా చేసి ప్రతి ఒక్క అభిమానిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు కాస్త తగ్గడం ప్రారంభమయ్యాయి.


అనంతరం ఉదయ్ కిరణ్ వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత తన భార్యతో కలిసి ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపాడు. ఏమైందో తెలియదు కొంతకాలానికి ఉదయ్ కిరణ్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానికి సంబంధించి ఎన్నో రకాల విషయాలు బయటకు వచ్చినప్పటికీ అసలు విషయం బయటికి రాలేదు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం మాత్రం తెలియనప్పటికీ అతని మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేరు.


ఇది ఇలా ఉండగా.... ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై నువ్వు నేను సినిమా హీరోయిన్ అనిత స్పందిస్తూ కొన్ని సంచలన కామెంట్లు చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లుగా వెల్లడించింది. ఉదయ్ కిరణ్ చాలా మంచోడు నిజాయితీపరుడు అంటూ వ్యాఖ్యానించింది. అలాంటి నటుడు మళ్ళీ ఇండస్ట్రీకి తిరిగి రాడని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: