కీర్తి సురేష్ పరువు పాయె: హీరోయిన్‌కు ‘పేరు’ కష్టాలు..?
15 సంవత్సరాల పాటు రిలేషన్ కొనసాగించిన ఈ జంట డిసెంబర్ 12న వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. గోవాలో వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. వివాహానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. కాగా వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరిగింది. వివాహం జరిగిన అతి తక్కువ సమయంలోనే కీర్తి సురేష్ మళ్లీ షూటింగ్ లలో చురుగ్గా పాల్గొంటుంది.
తాజాగా ముంబైలో జరిగిన సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది కీర్తి. బాలీవుడ్ ప్రాజెక్ట్ బేబీ జాన్ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుంది. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా కీర్తి సురేష్ కు వింత అనుభవం ఎదురయింది. అక్కడి రిపోర్టర్లు కీర్తి సురేష్ ఎక్కడికి వెళితే అక్కడ వెంట పడుతున్నారు. శుక్రవారం కెమెరామెన్లు కీర్తి సురేష్ ఫోటోలు తీస్తూ 'కృతి ఇటు చూడండి' అంటూ గట్టిగా అచ్చారు.
దీంతో కీర్తి సురేష్ వెంటనే 'కృతి కాదు కీర్తి' అని చెప్పారు. ఆ తర్వాత మరొకరు 'కీర్తి దోశ' అంటూ పిలిచారు. మళ్లీ కీర్తి సురేష్ వెంటనే 'కీర్తి దోశ కాదు' కీర్తి సురేష్. 'దోశ' మాత్రమే నాకు ఇష్టమైంది అని నవ్వుతూ సమాధానం చెప్పారు. దీంతో ముంబైలో కీర్తి సురేష్ పేరుకు కష్టాలు వచ్చాయంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.