మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా కియారా అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ముఖ్య పాత్రలలో నటించగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఈ మూవీ నుండి ఇప్పటికే మేకర్స్ నాలుగు పాటలను విడుదల చేయగా ఆ నాలుగు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను డిసెంబర్ 27 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని వార్త ఒకటి వైరల్ అయింది. దానితో డిసెంబర్ 27 వ తేదీన ఈ మూవీ ట్రైలర్ వస్తుంది అని జనాలు చాలా మంది అనుకున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 27 వ తేదీన విడుదల కాకపోగా ఈ సినిమా ట్రైలర్ ను ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే దానిపై కూడా మేకర్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
దానితో ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అనే దానిపై మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.