సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఇంకా అధికారికంగా అనౌన్స్ కూడా కాలేదు. కానీ అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. అభిమానులు ఎగబడి చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తోంది. మూవీలో ప్రియాంకా చోప్రాను ఫిక్స్ చేసేసారు.మిస్ వరల్డ్ పోటీల్లో నెగ్గిన ప్రియాంక, బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించింది.దాదాపు 20ఏళ్ల పాటు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక, హాలీవుడ్ సినిమాల దాకా వెళ్లిపోయింది. అలా గ్లోబల్ స్టార్ ట్యాగ్ సంపాదించిన ప్రియాంకను సినిమాలో తీసుకుంటే హాలీవుడ్ లెవెల్లోనూ క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారేమో! కానీ, ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చూడాలి మరి జక్కన్న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న సినిమాలో మహేశ్తో ఏ అమ్మడు జోడీ కట్టనుందో లేదో.అలాగే ఈ మూవీ లో మరో కీలక పాత్రలో మలయాళ విలక్షణ నటుడు పృథ్విరాజ్ నటించనున్నట్లు ఫిలిం నగర్ లో టాక్. అలాగే రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంక్రాంతి తరువాత జరగొచ్చని సమాచారం.ఇదిలావుండగా గుంటూరు కారం తరువాత మహేష్ బాబు తన లుక్‌ను మార్చుకునే పనిలో పడ్డాడు. తన కెరీర్‌లో మొదటి సారిగా గుబురు గడ్డం, మీసం పెంచుకుని కనిపించాడు. ఇక పొడవాటి జుట్టుతో మహేష్ బాబు లుక్‌ను చూసి అంతా ఫిదా అయ్యారు. ఈ లుక్‌లోనే జాన్ విక్ రీమేక్ కూాడా చేసేయ్ బాబు అంటూ మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్టులు కూడా పెట్టేశారు. జేమ్స్ బాండ్ టైపులో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేయమని సలహాలు కూడా ఇస్తున్నారు.అలా మొత్తానికి జక్కన్న మంచి ప్లానే వేశాడని అంతా అనుకుంటున్నారు. మరి వీటిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.