నందమూరి బాలకృష్ణ వరుస పెట్టి విజయాలను అందుకుంటూ కెరియర్ను ఫుల్ జోష్లో ప్రస్తుతం ముందుకు సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా మూడు విజయాలను అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగు వంశీ నిర్మిస్తున్నాడు. తాజాగా నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన తాజాగా డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. ఈయన చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు ఒక్క సారిగా పెరిగిపోయాయి. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ వంశం మాట్లాడుతూ ... డాకు మహారాజ్ సినిమాలో ఇంటర్వెల్ సన్నివేశానికి 20 నిమిషాల ముందు అద్భుతమైన సన్నివేశం స్టార్ట్ అవుతుంది. ఆ సన్నివేశం స్టార్ట్ అయినప్పటి నుండి ఇంటర్వెల్ వచ్చేంత వరకు 20 నిమిషాల పాటు కంటిన్యూగా అద్భుతమైన సన్నివేశం వస్తుంది.
పేపర్లు విసరడం మొదలు పెట్టిన వారు 20 నిమిషాల పాటు పేపర్లు విసురుతునే ఉంటారు. ఆ రేంజ్ లో ఆ సన్నివేశం ఉంటుంది అని చెప్పాడు. అలా ఈ మూవీ ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాలు అద్భుతంగా ఉండబోతుంది అని నాగ వంశీ చెప్పడంతో ఈ మూవీ పై బాలయ్య అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.