వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అరకులో జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కానున్నట్లు సమాచారం అందుతోంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఇంత ఫాస్ట్‌గా ఒక స్టార్ హీరో సినిమా పూర్తి కావడం ప్రధమం అంటూ సినీ వర్గాల వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో చేస్తూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం మానిటరింగ్ చేస్తున్నారట. రీ రికార్డింగ్ సైతం మొదలు అయింది. త్వరలో షూటింగ్‌ను ముగించి వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ పాత్రలకు డబ్బింగ్ చెప్పిస్తే సినిమా రెడీ అయినట్లే. డిసెంబర్ రెండో వారం లేదా మూడో వారంకు సినిమా మొదటి కాపీ ని రెడీ చేసి ప్రమోషన్స్ కి వెళ్లాలి అని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నాడు.
చాలా విభిన్నమైన ప్రమోషన్స్ చేయడం ద్వారా జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇదిలావుండగా ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా నుండి ఇంకా టీజర్ ను విడుదల చేసింది లేదు. వాస్తవానికి వెంకటేష్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 13న టీజర్ వదులుతారు అని అంతా భావించారు. కానీ టీజర్ కట్..వర్క్ జరగకపోవడం వల్ల ఆ టైంకి ఇవ్వలేకపోయారు అని మేకర్స్ చెప్పుకొచ్చారు.కానీ ఇన్సైడ్ టాక్ వేరేగా వినిపిస్తుంది. అదేంటంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది చాలా లైటర్ వేన్ కథ అని తెలుస్తుంది. మొత్తం ఎంటర్టైన్మెంట్ పైనే ఈ సినిమా కథనం ఉంటుందట. అందువల్ల టీజర్ ను వెంటనే రిలీజ్ చేస్తే.. కథ రివీల్ అయిపోతుంది అని నిర్మాతలు భయపడుతున్నట్లు సమాచారం.కొద్దిరోజుల క్రితం ‘మా సినిమా కథని గెస్ చేయండి’ అంటూ టీం మీడియాకి పజిల్ పెట్టడం వల్ల కూడా చాలా వరకు కథ లీక్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారట. అందుకే టీజర్ వదలకుండా ట్రైలర్ నే రిలీజ్ చేయాలని చాలా పగడ్బందీగా టీం.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ కట్లు చేయిస్తున్నట్టు వినికిడి.ఇక ఈ సినిమా కోసం రమణ గోకులతో పాట పాడించడం వల్ల ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. వంద కోట్లకు పైగా ఈ సినిమా రాబడుతుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.