మరోసారి బాక్సాఫీస్ దండయాత్రకు సై అంటున్న దేవర .. కొరటాల ప్లానింగ్ అదుర్స్..!
మాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని .. కలెక్షన్ల సునామీ సృష్టించింది . రిలీజ్ అయిన ప్రతి చోట ముందుగా నెగటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ లో మాత్రం దుమ్ము రేపింది . ఆ సెంటర్ ఈ సెంటర్ అనే తేడా లేకుండా దసరా కనకగా రిలీజ్ అయిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది . ఎన్టీఆర్ నటనకు యాక్షన్ సీన్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి .
ఇక దేవర విజయంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు . ఇక దేవర థియేటర్లోనే కాదు ఓటీటీ లో కూడా దండయాత్ర చేశారు .. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ దేవర టాప్ ట్రెండింగు లో నిలిచింది . ఈ క్రమంలోనే దేవర సీక్వెల్ భారీ అంచనాలు పెరిగాయి . అయితే దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి . స్క్రీన్ ప్లే , కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు కొరటాల శివ తన టీం గత కొన్ని వారాలుగా దీని మీదే పనిచేస్తున్నాయి .
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది . ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు . సౌత్ మ్యూజిక్స్ సెన్సే అనిరుద్ సంగీతం అందించారు . ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టి పెడతారు .