మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సోసియో ఫాంటసీ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని వంశీ , ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలు వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా విడుదల కాకముందే చిరు వరుస పెట్టి అనేక మంది దర్శకుల సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇప్పటికే అనిల్ రావిపూడి , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు. చిరంజీవి తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరో ఇద్దరు దర్శకుల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి మరో తమిళ దర్శకుడి సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు ఈయన పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటించడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన అభిమన్యుడు సర్దార్ సినిమాలు తెలుగులో విడుదల అయ్యి మంచి విజయాలు సాధించడంతో ఈ దర్శకుడికి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక మిత్రన్ దర్శకత్వంలో చిరు ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. దీనితో చిరు నెక్స్ట్ మూవీల డైరెక్టర్ల లిస్టు భారీగా పెరిగిపోతుంది అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.