తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రమేష్ వర్మ ఒకరు. ఈయన తన కెరియర్లో ఎక్కువ శాతం రవితేజ హీరోగా రూపొందిన సినిమాలకు దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ వీర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఇక రమేష్ వర్మ ఆఖరుగా రవితేజ హీరోగా డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రూపొందిన కిలాడి మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ దర్శకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రాక్షసుడు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రక్షసన్ అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ప్రస్తుతం రమేష్ వర్మ , రాఘవ లారెన్స్ హీరోగా కాల భైరవ అనే సినిమా చేస్తున్నాడు.
ఇక మరో మూవీ ని కూడా ఈ దర్శకుడు సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన తన తదుపరి మూవీ ని బాలీవుడ్ నటుడు అయినటువంటి అజయ్ దేవగన్ హీరో గా చేయబోతున్నట్లు , ఈ సినిమాను ఏ స్టూడియో సంస్థ నిర్మించబోతున్నట్లు , ఈ సంస్థ వారు ఈ సినిమాను ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అలా రమేష్ వర్మ , అజయ్ దేవగన్ హీరో గా భారీ బడ్జెట్ తో సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.