అల్లు అర్జున్ కు మరో షాక్...పుష్ప 2పై కొత్త కేసు ?
పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారట కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
ఇది ఇలా ఉండగా...ఐకాన్ స్టార్, టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వివాదం కొనసాగుతున్న తరుణంలో... తెలుగు మీడియా మాత్రం దారుణంగా వ్యవహరిస్తోందని జనాలు ఆగ్రహిస్తున్నారు. ఈ వివాదంలో రేవంత్ సర్కార్ ను ప్రశ్నించేందుకు తెలుగు మీడియా వెనకాడుతోందని... వివిధ ఘటనలను ఎత్తిచూపుతూ రేవంత్ ను నేసనల్ మీడియా ప్రశ్నిస్తోందని జనాలు మాట్లాడుకుంటున్నారు.
గంట పాటు అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయమై చర్చ చేపట్టడం ఎందుకు ? అంటూ నేసనల్ మీడియా ప్రశ్నిస్తోంది. ఇంకా తీవ్రమైన సమస్యలేం తెలంగాణ రాష్ట్రంలో లేవా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని వాయించింది జాతీయ మీడియాజ నేషనల్ మీడియా నిలదీస్తున్నా..ప్రభుత్వ వైఫల్యాలు , ప్రజా సమస్యలపై.... ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తెలుగు మీడియా సంకోచిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో మరోసారి నేషనల్ మీడియాలో అపఖ్యాతి పాలు అవుతున్నాడని సీఎం రేవంత్ పై నెటిజెన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. పలు తీవ్రమైన సమస్యలతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. అసెంబ్లీలో గంటపాటు అల్లు అర్జున్ విషయమై చర్చ చేపట్టడంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి నేషనల్ మీడియా ఛానెల్స్.