హెరాల్డ్ 2024 హీరోయిన్స్: చిన్న హీరోయిన్ కొట్టిన పెద్ద హిట్లు!
అంతకు ముందు ఈ బ్యూటీ ‘ఆయ్’లో నితిన్ నార్నె సరసన కూడా నటించి మురిపించింది. ఆ సినిమాలో ఎక్కువ కులానికి చెందిన చలాకి అమ్మాయిగా.. నయన్ చూపించిన పెర్ఫార్మన్స్ ప్రశంసలు దక్కించుకుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ల దెబ్బకు అమ్మడికి మీడియం నిర్మాతల నుంచి వరస కాల్స్ వస్తున్నాయట. నిజానికి దీనికన్నా ముందు తను ఆనంద్ దేవరకొండ ‘గంగం గణేశా’లో చేసింది. అదే డెబ్యూ. కానీ ఫ్లాప్ కావడంతో పాటు అందులో ప్రాధాన్యత ఏమంత లేకపోవడంతో ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు ఆయ్, క అంటూ చిన్న అక్షరాలా టైటిల్స్ పెట్టుకున్న సినిమాలతో నయన్ సారిక హిట్లు అందుకుంటుంది. హైదరాబాద్ కే చెందిన ఈ తెలుగమ్మాయి ఇన్స్ టాలో మూడు లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. నయన్ సారిక బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ లోనూ నటించింది.
ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత విషయానికి వస్తే.. నయన్ సారిక 23 అక్టోబర్ 2001న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జన్మించింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసిన ఈ వయ్యారి భామ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.