మంచు ఫ్యామిలీలో గొడవలు చల్లారాయి అనుకుంటే మళ్లీ అగ్గిరాజుకుంది. ఈరోజు మంచు మనోజ్ తల్లి నిర్మలాదేవి పుట్టినరోజు అనే సంగతి మనకు తెలిసిందే.నిర్మలా దేవి పుట్టినరోజు సందర్భంగా మనోజ్ తల్లి పై తన తల్లి గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.అలాగే తల్లి పై తనకున్న ప్రేమని మరొకసారి చాటి చెప్పారు. అయితే అలాంటి మనోజ్ తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ బాట పట్టినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన అన్న తన ఫ్యామిలీని చంపేందుకు పెద్ద కుట్ర చేశాడు అంటూ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. మరి ఇంతకీ విష్ణు చేసిన పని ఏంటి.. ఎందుకు మనోజ్ ఫ్యామిలీ పై పగ పట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.. నిర్మలా దేవి బర్త్డే సందర్భంగా మంచు మనోజ్ ఇంట్లో ఒక చిన్న పార్టీని అరేంజ్ చేశారట.
అయితే ఆ పార్టీలో బయట నుండి జనరేటర్లను మనోజ్ తీసుకువచ్చుకోవడంతో ఆ జనరేటర్లలో డీజిల్ కలిపిన పంచదార పోసి నా ఫ్యామిలీని చంపాలని చూసాడు.. ఇక మంచు విష్ణు చేసిన పని నాకు కోచ్ చూసాడు.కానీ ఆయన్ని ఈ విషయం బయటకు చెబితే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే మంచు విష్ణు చేసిన పని వల్ల విద్యుత్లో భయంకరమైన హెచ్చుతగ్గులు రావడం వల్ల మేము చాలా భయపడిపోయాం.
మంచు విష్ణు కి పోలీసులు ఎన్నిసార్లు వార్నింగులు ఇచ్చి హెచ్చరించినా కూడా నన్ను నా ఫ్యామిలీని టార్చర్ చేస్తూనే ఉన్నారు.ఈరోజు అయితే ఏకంగా నా ఫ్యామిలీని చంపేయడానికి హత్య ప్రయత్నం కూడా చేశారు.. అంటూ మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీసుల దగ్గర సంచలన విషయాలు బయట పెట్టారు. ఇక మనోజ్ మాటలతో మరొక్కసారి మంచు పంచాయితీ రోడ్డు మీద పడింది.మరి ఈ విషయంపై మంచు విష్ణు ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి