బిగ్ బాస్ విజేత ఫ్రైజ్ మనీ భారీ స్థాయిలో పెరిగిందిగా.. ఫ్రైజ్ మనీ ఎంతంటే?

frame బిగ్ బాస్ విజేత ఫ్రైజ్ మనీ భారీ స్థాయిలో పెరిగిందిగా.. ఫ్రైజ్ మనీ ఎంతంటే?

Reddy P Rajasekhar
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్8 ముగింపుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. బిగ్ బాస్ షో సీజన్8 విన్నర్ కు సంబంధించిన వివరాలు సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. గతంలో బిగ్ బాస్ విజేతకు కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే ఫ్రైజ్ మనీగా ఇచ్చేవారు. అయితే ఈ సీజన్ కు మాత్రం ఫ్రైజ్ మనీ రికార్డ్ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది.
 
ఈ సీజన్ విజేతగా నిలిచిన వ్యక్తికి ఫ్రైజ్ మనీతో పాటు మారుతీ డిజైర్ కారు బహుమతిగా దక్కనుందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ సీజన్8 నిర్వాహకులు భారీ మొత్తం ఇచ్చే దిశగా ప్లాన్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్8 గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.
 
బిగ్ బాస్ షో సీజన్8 ను సక్సెస్ చేయడం కోసం నాగార్జున సైతం ఎంతో కష్టపడ్డారు. అయితే కంటెస్టెంట్ల ఎంపికలో పొరపాట్లు, ఇతర కారణాల వల్ల బిగ్ బాస్ షో ప్రేక్షకులను మెప్పించలేదనే చెప్పాలి. బిగ్ బాస్ షో కోస నిర్వాహకులు ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేశారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల కోసం కూడా నిర్వాహకులు ఎక్కువ మొత్తం ఖర్చు చేశారని తెలుస్తోంది.
 
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో మొదటి నాలుగు సీజన్లు సక్సెస్ కాగా బిగ్ బాస్ సీజన్7 కూడా ప్రేక్షకుల మెప్పు పొందింది. బిగ్ బాస్ షో సీజన్8 మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షోకు బదులుగా మరికొన్ని కొత్త షోలు ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షోకు సంబంధించి భవిష్యత్తులో ఏవైనా మార్పులు చేస్తారేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: