వేణు స్వామి : అల్లు అర్జున్‌ కచ్చితంగా సీఎం అవుతాడు ?

frame వేణు స్వామి : అల్లు అర్జున్‌ కచ్చితంగా సీఎం అవుతాడు ?

Veldandi Saikiran
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  అతి త్వరలోనే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి అవుతాడని బాంబు పేల్చారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి. త్వరలోనే పార్టీ పెట్టి మరి ముఖ్యమంత్రి అవుతారని... అల్లు అర్జున్ జాతకం బయట పెట్టారు. యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.
 

ఈ మధ్యకాలంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి... సినిమా సెలబ్రిటీల గురించి... పెద్దగా ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నారు.  అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఇద్దరు సెలబ్రిటీలు ఎంగేజ్మెంట్ చేసుకున్న సందర్భంగా... అంటే ఆగస్టు మాసంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి. ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి అయిపోయిన తర్వాత... మూడు సంవత్సరాలు కాపురం చేసిన అనంతరం అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత...  కాపురంలో గొడవలు ప్రారంభమవుతాయని వేణు స్వామి అప్పట్లో పేర్కొన్నాడు.

దీంతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పైన.. కుట్రలు చేసి కేసులు వేశారు. తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించిన జర్నలిస్టులు కూడా.. వేణు స్వామి ఎక్కడ కూడా సెలబ్రిటీల జాతకాలు చెప్పకుండా..  రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు.అయితే అప్పటినుంచి బయటికి రాలేదు వేణు స్వామి.అయితే తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంగా...ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
 

త్వరలోనే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి అవుతాడని వేణు స్వామి చెప్పడం జరిగింది. మన ఇండియా సంస్కృతి ప్రకారం జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఈ లెక్కన అల్లు అర్జున్ కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాడని... కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందని తెలిపాడు. దీంతో వేణు స్వామి చెప్పిన  మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కేసులు అల్లు అర్జున్ సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: