అల్లు అర్జున్ అరెస్ట్.. అడ్డంగా దొరికిపోయిన రేవంత్... లేఖ వైరల్?
ఈ నేపథ్యంలోనే.... అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అయితే రేవతి అనే మహిళ మృతి చెందడంతో సంధ్య థియేటర్ ఓనర్లు.... హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నేపథ్యంలో తాజాగా... అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసి కోర్టులో అల్లు అర్జున్ ను హాజరు పరిచారు.
అయితే ఈ కేసులో తెలంగాణ పోలీసులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పుష్ప 2 సినిమాషో కు హీరో అల్లు అర్జున్ వస్తున్నారని రెండు రోజుల కిందటే పోలీసులకు భద్రత కోసం సంధ్యా థియేటర్ యాజమాన్యం అడిగిందట. సెక్యూరిటీ పెంచాలని... కచ్చితంగా డిసెంబర్ 4వ తేదీన... ఎక్కువ స్థాయిలో పోలీసులు మోహరించాలని సంధ్యా థియేటర్ అప్లికేషన్ పెట్టుకుందట. అయితే దీన్ని విస్మరించిన తెలంగాణ పోలీసులు... లైట్ తీసుకున్నారట.
అయితే ఇప్పుడు... తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారట. ఈ నేపథ్యంలోనే... సంధ్య థియేటర్ ఓనర్లు విజ్ఞప్తి చేసిన లేఖ వైరల్ గా మారింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగే పోలీసులు అడ్డంగా దొరికినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. అన్యాయంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని మండిపడుతోంది.