సెల్ఫ్ మార్కెటింగ్ తో ఎదుగుతున్న బన్నీ.. మరిన్ని భారీ రికార్డులు ఖాయమా?

Reddy P Rajasekhar
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. అల్లు అర్జున్ సెల్ఫ్ మార్కెటింగ్ అతనికి చాలా ప్లస్ అవుతోంది. బన్నీ తరహాలో ఇతర స్టార్ హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేయడం లేదు. ఈవెంట్లు చేస్తున్నా ఆ ఈవెంట్లు సినిమాలకు ప్లస్ కావడం లేదు.
 
పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే ప్రభాస్, యశ్ క్రేజ్ ను సొంతం చేసుకోగా అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరాడేమో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తే ఆ సీక్వెల్స్ మరిన్ని సంచలన రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. బన్నీ ఖాతాలో సైతం మరిన్ని రేర్ రికార్డులు చేరే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటున్న బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించే సినిమాకు ఏ రేంజ్ లో మార్కెట్ చేస్తారో చూడాల్సి ఉంది. పుష్ప2 సాధించిన రికార్డులను బ్రేక్ చేయడం గేమ్ ఛేంజర్ కు సాధ్యమవుతుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రతి పాట స్పెషల్ గా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
బన్నీ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. అల్లు అర్జున్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో సైతం వేరియేషన్ చూపిస్తున్నారు. అల్లు అర్జున్ ఎంతోమంది హీరోలకు సైతం ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ ప్లానింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో అనే చర్చ జరుగుతుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: