టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే చిరంజీవి పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత పోయిన సంవత్సరం భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు. ఇక ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.
త్రిష ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత మూవీ ని శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి , శ్రీకాంత్ ఓదెలా కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఇప్పటికే శ్రీకాంత్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగ వంతం చేసినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా మూవీ లో విలన్ పాత్రకు ఓ నటుడిని కూడా ఫైనల్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లో విలన్ పాత్రలో సీనియర్ నటుడు రాజశేఖర్ ను తీసుకోవాలి అనే ఆలోచనలో శ్రీకాంత్ ఉన్నట్లు , అందులో భాగంగా ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు , అన్నీ ఓకే అయితే చిరు హీరోగా శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో రాజశేఖర్ విలన్ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి అని ఓ వార్త వైరల్ అవుతుంది.