"అందులో తప్పు ఏముంది..?"..ఆ విషయాన్ని అందరి ముందే కన్ఫామ్ చేసిన బన్నీ..ఇంత ఓపెన్ గా చెప్పేసాడు ఏంటి..?
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా మారింది. అఫ్కోర్స్ అల్లు అర్జున్ పేపర్ చూస్తూ చదివాడు స్పీచ్ అంటూ చాలామంది ట్రోల్ చేస్తున్న.. అంతమంది జనాలను చూసినప్పుడు ఆ ఆనందం తట్టుకోలేక ఒకటి రెండు పేర్లు తడబడచు అని ..గతంలో అలా తడబడిన కారణంగా ట్రోలింగ్ కి గురైయ్యాడు కాబట్టే ఈసారి జాగ్రత్తలు తీసుకున్నాడు అని చాలామంది బన్ని ఫ్యాన్స్ ఆ ట్రోలింగ్ ని తిప్పి కొడుతున్నారు. అయితే బన్ని స్పీచ్ మొత్తం అయిపోయాక అక్కడే ఉన్న హోస్ట్ అడిగిన క్వశ్చన్ కు బన్నీ పకపక నవ్వేశాడు.
పుష్ప2 సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది . "శ్రీవల్లి నా పెళ్ళాం.. పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటాదో ఈ పపంచానికి చూపిస్తా.." అంటూ పుష్ప2లో బన్నీ చెప్పిన ఒక డైలాగ్ బాగా హిట్ అయ్యింది. ఈ డైలాగ్ ను థాంక్స్ మీట్ లో ప్రస్తావిస్తూ హోస్ట్ "హస్బెండ్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్..?" అంటూ ప్రశ్నించారు . దీనికి నవ్వేసిన బన్నీ మైక్ తీసుకొని "ఏం చెప్తాం మహిళల ముందు మనం తగ్గిన పర్వాలేదు ..మీ భార్య మాట వినండి అంతే "అంటూ సమాధానం ఇచ్చారు . దీంతో చాలామంది బన్నీ మాటలు ఫన్నీ గానే తీసుకున్నారు. కానీ ఓ బ్యాచ్ మాత్రం బన్నీ మాటలు ట్రోల్ చేస్తున్నారు. నువ్వు నీ భార్య మాట విని కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చు ..అందరూ అలా కాదుగా అంటూ వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు . కొందరు మాత్రం భార్య మాట వినడంలో తప్పే లేదు అంటూ బన్నీ మాటలు ట్రెండ్ చేస్తున్నారు . సమస్తాలనే ఏలిన వాడు కూడా తనకు సమస్య వస్తే భార్య మాట వింటాడు అంటూ పెద్ద పెద్ద సామెతలను గుర్తు చేస్తున్నారు..!