లిప్ లాక్ నుండి కొడుకుని గెంటేయడం వరకు.. మోహన్ బాబు జీవితంలో ఇన్ని వివాదాలా..?

Pandrala Sravanthi
మోహన్ బాబు.. ఈ పేరు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారుతుంది. దానికి కారణం ఫ్యామిలీ లోని గొడవలని చెప్పుకోవచ్చు.అయితే మోహన్ బాబు ఫ్యామిలీలో ఈ గొడవలన్నీ జరగడానికి కారణం ఎవరో కానీ ఇద్దరు సై అంటే సై అంటూ ఒకరికి పై ఒకరు బౌన్సర్లతో రెచ్చిపోతున్నారు.ఇదిలా ఉంటే మోహన్ బాబు ముందు నుండి చాలా కోపిష్టి అని ఆయన కోపం వస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేరని ఇండస్ట్రీ వారి మాట. అయితే మోహన్ బాబు ఇప్పటివరకు ఎన్ని వివాదాలు ఇరుక్కున్నారో ఇప్పుడు చూద్దాం.. మోహన్ బాబు మొదట శ్రీరాములయ్య సినిమా తీసిన సమయంలో ఓ బాంబు దాడికి గురయ్యారు. మోహన్ బాబు అదృష్టం కొద్ది ఆ దాడి నుండి బయటపడ్డారు.ఇక ఆ బాంబు దాడిలో దాదాపు 25 మంది మరణించారు. ఇక తర్వాత మోహన్ బాబు తన కొడుకు విష్ణు హీరోగా చేస్తున్న విష్ణు మూవీలో హీరోయిన్ ని ముద్దు సన్నివేశంలో నటించమని కోరారట. కానీ ఆమె దానికి ఒప్పుకోకపోవడంతో శిల్పా శివానాంద్ ని అందరూ చూస్తుండగానే కొట్టారు.

ఇక ఈ విషయంలో శిల్పా సోదరి సాక్షి శివానంద్ మోహన్ బాబు పై కేస్ కూడా పెట్టారు.అలాగే హీరో రజినీకాంత్ మోహన్ బాబులు ఎంత మంచి ఫ్రెండ్సో చెప్పనక్కర్లేదు. కానీ ఓ సమయంలో రజినీకాంత్ ని మోసం చేశారట మోహన్ బాబు. జూబ్లీహిల్స్ లో తక్కువ ధరకే భూమి కొందామని వచ్చిన రజినీకాంత్ కి మాయమాటలు చెప్పి ఆ భూమి కొనకుండా చేశారట.అలాగే లెజెండరీ కమెడియన్ అయినటువంటి బ్రహ్మానందం ని కూడా ఓ సినిమా షూటింగ్ సెట్లో మోహన్ బాబు కొట్టారనే టాక్ అప్పట్లో వినిపించింది. అలాగే మెగా ఫ్యామిలీతో చాలా రోజుల నుండి ఈయనకు కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవికి లెజెండరీ నటుడి అవార్డు ఇవ్వడంతో మోహన్ బాబు స్టేజ్ మీదకు వచ్చి 500 సినిమాల్లో నటించిన నాకంటే ఆయన అవార్డు కి ఎలా అర్హుడో తెలియదు అంటూ పెద్ద వివాదానికి తెర లేపారు. దాంతో చిరంజీవి అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన అన్నని అవమానించినందుకు జీ అవార్డ్స్ వేడుకలో మోహన్ బాబు పై ప్రతీకారం తీర్చుకున్నారు. అలాగే వజ్రత్సవ వేడుకల్లో ఏఎన్ఆర్ మోహన్ బాబుని అవమానించారు.

ఎందుకంటే ఏఎన్ఆర్ సతీమణి అన్నపూర్ణమ్మ ఏఎన్ఆర్ కంటే నువ్వే గొప్ప నటుడివి అని నన్ను మెచ్చుకుందని మోహన్ బాబు చెప్పడంతో ఏఎన్ఆర్ మాట్లాడుతూ.. మోహన్ బాబు లాంటి కొంతమంది ఏదైనా సినిమా హిట్ అయితే అదంతా మనదే క్రెడిట్ అన్నట్లు చెప్పుకుంటారు. అలాగే మోహన్ బాబు తనకి అందరూ నమస్కారం పెట్టాలని అడిగి మరీ పెట్టించుకుంటాడు. పాపం పిచ్చోడు అంటూ మాట్లాడారు.అలాగే మంచు విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన సమయంలో కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసిన బెనర్జీని బూతులతో తిట్టాడు. ఇక ఆయన మాటలకు ఫీలయిన బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా మోహన్ బాబు జీవితంలో ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. అలాగే ఆయన విద్యాసంస్థల్లో కూడా ఏదో అవకతవకలు జరుగుతున్నట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి.ఇక తాజాగా మనోజ్ మోహన్ బాబుకి మనోజ్ కి మధ్య జరిగిన వివాదం అయితే అంతా ఇంతా కాదు.ఇది కుటుంబ సమస్య కానీ రోడ్డుకెక్కింది.దాంతో ఈ వివాదం మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు క్రమశిక్షణకు మారుపేరులా ఉండే మోహన్ బాబు జీవితంలో ఇన్ని వివాదాలు ఉన్నాయా అంటూ ఈ విషయాలు తెలిసిన చాలామంది షాక్ అవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: