"ఆ కటౌట్ చూస్తేనే కొరుక్కుని తినేయాలి అనిపిస్తుంది".. తెలుగులో శోభిత ధూళిపాళ్ల ఫేవరేట్ హీరో ఆయనే..!
స్పెషల్ గౌరవం కూడా ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా శోభిత ధూళిపాళ్ళను ఒక హీరోయిన్ గా కాకుండా నాగచైతన్య భార్యగా అక్కినేని ఇంటికి కోడలుగా చూపిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూ వస్తుంది. రీసెంట్గా శోభిత ధూళిపాళ్ల తన పెళ్లికి రెడీ అవుతున్న ఒక వీడియోని షేర్ చేసింది . చాలా అందంగా ముస్తాబైన శోభిత ధూళిపాళ్ల బన్నీ నటించిన బ్లాక్ బస్టర్ సాంగ్ కి స్టెప్స్ కూడా వేసింది . దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోను బాగా ట్రెండ్ చేస్తున్నారు . శోభిత ధూళిపాళ్ల ఫేవరెట్ హీరో బన్నీ అయ్యి ఉండొచ్చు అని అందుకే తన పెళ్లిలో సాంగ్ ప్లే చేయించుకొని మరి డాన్స్ చేస్తుంది అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఈ వీడియో హైలైట్ గా మారింది.
ప్రజెంట్ ఈ వీడియోని బన్ని అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . అయినా బన్ని కటౌట్ అలాంటిది. ఆ కటౌట్ చూస్తేనే కొరుక్కుని తినేయాలి అనిపిస్తూ ఉంటుంది అంటారు జనాలు. కాగా శోభిత - నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని కారణాల చేత ఆమెకు విడాకులు ఇచ్చేసి మరి శోభిత ధూళిపాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే సమంత ఫ్యాన్స్ కి మాత్రమే ఈ విషయం మింగుడు కూడా పడడం లేదు. ప్రేమ అనేది లైఫ్ లో ఒక సారి పుడుతుంది అని ఇన్నిసార్లు పుడితే దాన్ని ప్రేమ అనరని దానికి వేరే అర్థం ఉంది అని ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!