అన్ని చోట్ల భారీ కలెక్షన్స్.. కానీ అక్కడ మాత్రం డల్ అయిన పుష్ప రాజ్..!!

murali krishna
పుష్ప’.. ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్రేక్ చేస్తున్న రికార్డ్స్ మోత మోగిస్తున్నాయి. 2017లో పుష్ప వన్ తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ పలు కీలక పాత్రల్లో నటించారు. పుష్ప 1 సినిమా విడుదలైనప్పుడు సంచలన విజయాన్ని అందుకుంది. కాసుల వర్షం కురిపించింది.ఇక ఇప్పుడు పుష్ప 2, పార్ట్ వన్ కి మించిన విజయంతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజే 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓపెనింగ్స్ తోనే సరికొత్త రెకార్డ్స్ నెలకొల్పిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో 500 కోట్లకి పైగా వసూలు చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఇతర భాషల్లో కూడా భారీ వసూళ్లను అందుకుంటుంది.అయితే.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలీలో దుమ్మురేపుతున్న పుష్ప 2.. మలయాళంలో మాత్రం ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతోంది. దానికి కారణం.. మల్లు ఫ్యాన్స్ గుర్రుగా ఉండటమేనని తెలుస్తోంది.పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ రోల్‌పై ప్రేక్షకులు భారీగా అంచనాల్ని పెట్టుకున్నారు. 2021లో వచ్చిన 'పుష్ప : ది రైజ్'లో భన్వర్ సింగ్ షెకావత్‌గా చాలా పవర్‌ఫుల్‌గా ఫహాద్ ఫాజిల్‌ని చూపించి సుకుమార్.. పుష్ప 2లో మాత్రం చాలా సిల్లీగా చూపించారు. పుష్ప రాజ్, భన్వర్ సింగ్ షెకావత్‌ మధ్య ఢీ.. అంటే ఢీ అనే సన్నివేశాలు ఊహించిన స్థాయిలో తెరపై కనిపించలేదు. మలయాళంలో ఇప్పటికే టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న ఫహాద్ ఫాజిల్‌ను ఇలా సిల్లీగా పుష్ప2లో చూపించడంపై మల్లు ఫ్యాన్స్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రభావం.. మూవీ కలెక్షన్లపై కూడా కనిపిస్తున్నాయి.పుష్ప 2 చూసిన తర్వాత.. పుష్ప 1లో ఫహాద్ ఫాజిల్ కనిపించింది కాసేపైనా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. కానీ.. పుష్ప2లో స్క్రీన్ స్పేస్ పెరిగినా.. అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదని మలయాళీలు ఫీల్ అవుతున్నారు. అలానే ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ ఎండింగ్ కూడా అర్థవంతంగా లేదు. దాంతో సినిమాపై కేరళవాసులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.ఇదిలావుండగా ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.800 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: