ఓజీ వర్సెస్ హరిహర వీరమల్లు .. డిప్యూటీ సీఎం ఎటు మొగ్గుతారు .. టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్..!

Amruth kumar
ఎడమ కన్నూ నాదే.. కుడి కన్నూ నాదే .. రెండిట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్పాలి ? ఈ మాటలు మనం అనుకోవడానికి బానే ఉంటాయి .. కానీ కుడి , ఎడమలో ఏదో ఒకదాన్ని కచ్చితంగా మనం సెట్ చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి ? ప్రస్తుతం ఇదే సిచువేషన్ లో ఉన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు ? .. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు కెరియర్లోని ఫస్ట్ పాన్ ఇండియా సినిమా.. సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం  సమర్పణలో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను మొదలుపెట్టారు.. ఇప్పుడు ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి .. మనపైనున్న దొంగలందర్నీ దోచుకోవడానికి ఆ భగవంతుడు కచ్చితంగా ఒకడ్ని పంపిస్తాడు .. వాడొచ్చి ఈ దొంగ దొరల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ వచ్చిన టీజర్ హరిహర వీరమల్లకు మంచి క్రెజ్‌ తీసుకొచ్చింది .  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాల్ షీట్లను దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ సెట్స్ అన్నిటిని విజయవాడ పరిసరాల్లో వేశారు .. గట్టిగా ఇంకో షెడ్యూల్ చేస్తే ఈ సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. వచ్చే సంవత్సరం మార్చ్ 28న ఎలా అయినా ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు ..

అయితే ఇప్పుడు పవన్ నటిస్తున్న మరో సినిమా ఓజీ పరిస్థితి ఏమిటి ? హరిహర వీరమల్ల తో పాటు ఓజీ మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి .. మరో వారం రోజులు పవన్ కాల్ షీట్స్ ఇస్తే చాలు సినిమాను కంప్లీట్ చేసుకుంటామనే మాట ఈ కాంపౌండ్ లో వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ? ఓజీ వర్సెస్ హరిహరవీరమల్లులో డిప్యూటీ సీఎం ఎటు మొగ్గుతారు ? ఏ సినిమాను ముందు రిలీజ్ చేస్తారు .. ప్రస్తుతం ఇదే ప్రశ్నలు అభిమానుల్లో అంతుచిక్కని ప్రశ్నల మిగిలిపోయాయి .. పవన్ కళ్యాణ్ ఇచ్చే  సిగ్నల్స్ ని బట్టి ఆన్సర్స్ వెతుక్కోవాల్సిందని కొందరు అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: