"పుష్ప 2" కోసం ఫ్యాన్స్ భారీ క్యూ.. ఇది కదా అభిమానమంటే..!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప-1' పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచనలనం సృష్టించిందో తెలిసిందే.ఇప్పుడు దానికి కొనసాగింపుగా రూపొందిన 'పుష్ప 2' భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి.. భారతదేశ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మరి ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలో భారీ వసూళ్లు రాబడుతుంది పుష్ప 2. హిందీలో మొదటి రోజు 72 కోట్ల నెట్ వసూళ్లు చేసిన ఈ సినిమా రెండవ రోజు 59 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజే హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన షారుఖ్ జవాన్ సినిమా 69 కోట్లను బ్రేక్ చేసింది. అయితే మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే అనుకోవచ్చు. కానీ మూడో రోజు కూడా అత్యధిక కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది.

పుష్ప 2 సినిమా మూడవ రోజు హిందీలో ఏకంగా 74 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా హిందీలో మూడో రోజు అన్ని కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో పుష్ప 2 బాలీవుడ్ లో కూడా అసరికొత్త రికార్డ్ సెట్ చేసింది. పుష్ప 2 కేవలం హిందీలోనే మొత్తం మూడు రోజులు కలిపి 205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు మేకర్స్.ఇదిలావుండగా నిన్న ఆదివారం ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో సినిమా చూడటానికి దాదాపు 250 మీటర్ల క్యూలో ప్రేక్షకులు నిలబడ్డారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మేకప్ స్పందిస్తూ లాంగ్క్యూజ్, హౌస్ ఫుల్ బోర్డ్స్,హ్యాపీ ఆడియన్స్. పుష్పటుతో నిజమైన సినిమా వేడుకలు జరుగుతున్నాయి అని రాసుకొచ్చింది.కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయిలో రికార్డు బ్రేక్ చేసిందంటే రానున్న రోజుల్లో పుష్ప హిందీ వెర్షన్ ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: