టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. డిసెంబర్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది.
దానితో ఈ సినిమా ఈజీగా 1000 కోట్లకు మించిన కలెక్షన్లను రాబడుతుంది అనే ఆశ భావాన్ని చాలా మంది జనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా పుష్ప పార్ట్ 2 మూవీ అద్భుతమైన విజయం అందుకునే అవకాశాలు ఉండడంతో అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఇక పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత ఈయనకు సంబంధించిన ఏ మూవీ అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ ని అట్లీ దర్శకత్వంలో చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ మూవీ క్యాన్సిల్ అయింది అని వార్తలు వచ్చాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ తన నెక్స్ట్ మూవీ చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలబడలేదు. మరి పుష్ప పార్ట్ 2 మూవీ భారీ విజయం సాధించే అవకాశాలు ఉండడంతో అల్లు అర్జున్ తన ఆలోచనలో మార్పులు చేసుకోవచ్చు అని , తన నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండేది క్లారిటీ లేదు అని , దానితో ఈయన నెక్స్ట్ మూవీ కి సంబంధించి అధికారిక ప్రకటన రావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. దానితో బన్నీ అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది.