అమెరికాలో ‘పుష్ప-2’ కొత్త చరిత్ర...ఆ రికార్డులు గల్లంతు ?

Veldandi Saikiran
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారుమోగుతోంది. దీనికి ఒకే ఒక కారణం పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ అయి...ప్రభంజనం సృష్టిస్తోంది.ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 500 కోట్లు క్రాస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. పుష్ప మొదటి భాగం సక్సెస్ కావడంతో ఈ రెండవ పార్ట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.అందుకే రెండున్నర  ఏళ్ల పాటు ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. ఇక సినిమా థియేటర్లలో డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడంతో జనాలంతా...సినిమా బాట పట్టారు.మన ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ఈ సినిమా దుమ్ము లేపుతోంది. సినిమా రిలీజ్ అయి మూడు రోజులు కాకముందే నార్త్ అమెరికాలో విపరీతమైన కలెక్షన్లను రాబట్టింది పుష్ప  2.
ప్రస్తుత లెక్కల ప్రకారం నార్త్ అమెరికాలో గ్రాస్ కలెక్షన్స్ 8 మిలియన్ డాలర్స్ కు చేరుకుంది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఇంతటి స్థాయిలో.. కలెక్షన్లు రాబట్టిన మొదటి సినిమాగా పుష్ప రికార్డు సృష్టించిందట. మరో రెండు రోజుల్లో నార్త్ అమెరికాలో ఈ సినిమా... మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
 ఇక పుష్ప 500 కోట్లు దాటాడంతో.... ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా నిన్న నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా సినిమాకు సహకరించిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు హీరో అల్లు అర్జున్. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు... ధన్యవాదాలు చెప్పారు. ఆయన కారణంగానే ఏపీలో టికెట్లు ధరలు విపరీతంగా పెరిగాయని.. దానివల్ల సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకొచ్చాడు ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: