రికార్డ్ సృష్టించిన పుష్ప-2..సౌత్ కంటే నార్త్ లోనే హవా సృష్టిస్తుందా.?

FARMANULLA SHAIK
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ సక్సెస్ తో దూసుకుపోతుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ పై విరుచుకు పడ్డాడా అన్నట్టుగా ఉంది పుష్ప 2 రిజల్ట్. ఫస్ట్ డే నే 294 కోట్లు వసూలు చేసి ఓపెనింగ్ డే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.అల్లు అర్జున్ మానియా మనకంటే ఎక్కువగా నార్త్ లో కనిపిస్తుండటం విశేషం. ఫస్ట్ పార్ట్ కూడా అక్కడే పెద్ద విజయం సాధించింది. అప్పుడు లాంగ్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ అన్నీ ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు రెండు రోజుల్లోనే వచ్చేస్తున్నాయి.. అంటే ఈ మూవీ నార్త్ ఆడియన్స్ కు ఏ రేంజ్ లో నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.ఇదిలావుండగా భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా ₹500 కోట్లు కలెక్షన్ సాధించిన సినిమాగా పుష్పటు రికార్డు సృష్టించింది.

అలాగే హిందీలో తొలి రెండు రోజుల్లో అత్యధిక వసుళ్ళు ₹131 కోట్లు గా రికార్డు నెలకొల్పింది.తొలి రెండు రోజుల్లోనే₹449 కోట్లు రాబట్టిన ఈ మువీ మూడో రోజు దేశవ్యాప్తంగా 120 కోట్ల వరకు రాబట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. మూడో రోజు సౌత్ ₹45కోట్లు, నార్త్ ₹75కోట్లు. అంటే సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువ వసూలు వచ్చినట్టు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో పుష్ప 2 ది రూల్ ని ఉత్తరాది ప్రేక్షకులు పూర్తిగా ఓన్ చేసుకున్నారు. ఎంతగా అంటే మొదటి రోజు ఓపెనింగ్ ఏకంగా షారుఖ్ ఖాన్ రికార్డుని బద్దలు కొట్టేంత. మాములుగా డబ్బింగ్ చిత్రాలకు ఆదరణ తక్కువగా ఉండే రాష్ట్రాల్లోనూ ఈ ప్యాన్ ఇండియా మూవీ సృష్టిస్తున్న భీభత్సం చూసి బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఒక నాన్ ప్రభాస్ అందులోనూ రాజమౌళి దర్శకత్వం వహించని ఒక కమర్షియల్ బొమ్మ ఈ స్థాయిలో ర్యాంపేజ్ చేయడం బహుశా ఇదే మొదటిసారని చెప్పాలి. ఇంతగా పుష్పరాజ్ ని తమ గుండెల్లో పెట్టుకోవడానికి దోహదం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: