స్టార్ హీరోయిన్ రూమ్ లో నితిన్.. అడ్డంగా బుక్కయ్యాడుగా.?

Pandrala Sravanthi
ఏంటి ఆ హీరోయిన్ రూమ్ లో నితిన్ ఏం చేస్తున్నారు.. ఇంతకీ ఈ వీడియోలో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు చూద్దాం.. నితిన్ చేతిలో ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో నితిన్ చేసిన ఏ సినిమా కూడా అనుకున్నంత మేర ఫలితాన్ని ఇవ్వడం లేదు.దాంతో ఈయన కెరీయర్ కి అర్జెంటుగా ఒక హిట్టు పడాలి అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.ఇప్పటికే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం, రంగ్ దే,  ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో కచ్చితంగా నితిన్ ఖాతాలో హిట్టు పడాలని,లేకపోతే ఈయన్నీ ఫ్యాన్స్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా మర్చిపోతారు అని ట్రోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈయన తన రెండు సినిమాలపైనే ఆశలన్ని పెట్టుకున్నారు. 

అలా రాబిన్ హుడ్,తమ్ముడు వంటి సినిమాలు హిట్ అవ్వాలని నితిన్ వాటి పైన తన పూర్తి ఎఫర్ట్ పెడుతునన్నారు.అయితే అలాంటి నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25న భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రష్మికను అనుకున్నప్పటికీ ఆమె తప్పుకోవడంతో శ్రీలీలలకి అవకాశం వచ్చింది. అయితే తాజాగా శ్రీలీల రూమ్ లో నితిన్ ఉన్నట్టు ఒక వీడియో షేర్ చేశారు మైత్రి మూవీ మేకర్స్.

ఇక అసలు విషయం ఏమిటంటే.. శ్రీలీల నితిన్ ని ఫ్రాంక్ చేసి ఆట పట్టిద్దాం అని హీరో అని రాసి ఉన్న దగ్గర హీరోయిన్ అని మార్చి లోపలికి వెళ్లి నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావ్ అని అంటుంది.దానికి లేదు నేను నా రూమ్ లోనే ఉన్నాను అని నితిన్ అనగా.. ఒకసారి బయటికి వచ్చి చూడు అని అంటుంది. దాంతో అక్కడికి వచ్చి చూడగా శ్రీలీల హీరోయిన్ అని మార్చి రాసినట్టు అర్థమయ్యి ఆ లెటర్స్ ని చెరిపేసి సైలెంట్ గా నవ్వేసి మళ్ళీ లోపలికి వెళ్తారు. అలా నీతిన్ ని ఫ్రాంక్ చేద్దాం అనుకున్నప్పటికీ నితిన్ అంతగా పట్టించుకోలేదు. దీంతో ఈ వీడియో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట  వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: