ఇంతకన్నా దారుణం ఉందా.. 2 డేకే 83 % డ్రాఫ్ అయిన ' పుష్ప 2 ' కలెక్షన్లు... లెక్కలివిగో...!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రు. 294 కోట్ల వసూళ్లు సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ కలెక్షన్లు ఫేకా ? నిజమా ? అన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. పుష్ప 2 మొదటి రోజు రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లుగా చెబుతూ.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమా గా పోస్టర్ విడుదల చేశారు. డిసెంబర్ 4, 5వ తేదీలు కలిపి ఒక్క రోజు ఎలా అవుతుంది ? డిసెంబర్ 4న ప్రదర్శితమైన షోల కలెక్షన్లు కూడా కలిపి డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అని ఎలా ప్రకటిస్తారు ? ఇవి ఒకరోజు లెక్కలా ? రెండు రోజుల లెక్కలా ? అన్న ప్రశ్నలు అందరి మదిలోనూ ఉత్పన్నమవుతున్నాయి.
అయితే రెండో రోజుకే పుష్ప 2 కలెక్షన్లు భారీగా డ్రాఫ్ అయిపోయాయి. తాజాగా కృష్ణ జిల్లాకు కలెక్షన్ల గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా మొదటి డే షేర్ రూ.4.42 కోట్లు వసూళ్లు రాబట్టి కృష్ణా జిల్లా కలెక్షన్ల రికార్ట్‌లో ఆల్‌టైమ్ రికార్డ్‌గా నిలిచిందని చెప్పారు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. అయితే అదే రెండో షేర్ చూస్తే షేర్ కేవలం రూ.77 లక్షలకు పడిపోయింది. మొత్తం మీద రెండు రోజులకు కలిపి కృష్ణా జిల్లా షేర్ కేవలం రూ. 5.19 కోట్లు మాత్రమే. కృష్ణాలో పెద్ద సినిమాల కలెక్షన్లతో ఇదొక ఘోర పరాజయంగా ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. రెండో రోజుకు ఏకంగా 83 % డ్రాఫ్ అంటే పెద్ద ఎదురు దెబ్బే అంటున్నారు. మూడో రోజు మరింత డౌన్ ఫాల్స్ కనిపిస్తున్నాయి.