రేవతి మృతికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం - అల్లు అర్జున్

Veldandi Saikiran
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  సంచలన ప్రకటన చేశాడు. తొక్కిసలాటలో మరణించిన... రేవతి కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 బుధవారం రాత్రి 9:30 గంటలకు షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి షో సంధ్య థియేటర్లో  వేశారు. అయితే ఈ థియేటర్ లో సినిమా చూసేందుకు  రేవతి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. 


తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా...  ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అందరూ అల్లు అర్జున్ పైన కామెంట్స్ చేస్తున్నారు.   అంతేకాదు సంధ్య థియేటర్ తో పాటు... అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని స్టూడెంట్ యూనియన్ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ వివాదాల నేపద్యంలో స్వయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... స్పందించారు.
 

పుష్ప 2 ప్రీమియర్ షోలో  రేవతి అనే మహిళ... మృతి చెందడంతో షాక్ నకు గురి అయ్యానని అల్లు అర్జున్ ప్రకటించారు. ఆ మరణ వార్తతో పుష్ప  2 సెలబ్రేషన్స్ లో కూడా యాక్టివ్గా పాల్గొనలేకపోయానని.. ఆవేదన వ్యక్తం చేశారు అల్లు అర్జున్. రేవతి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్. రేవతి కుటుంబానికి సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా  ప్రకటించారు అల్లు అర్జున్. 

పిల్లలకు ఎలాంటి సహాయం చేసేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని... వారి కుటుంబ సభ్యుల పట్ల.. తాము ఎప్పుడు సహాయం చేస్తామని.. పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్. అవసరమైతే తానే ఇంటికి వెళ్లి కలుస్తానని కూడా వివరించారు.  అయితే అల్లు అర్జున్ ఈ ప్రకటన చేయడంతో... రేవతి కుటుంబ సభ్యులు.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: