పుష్ప 2 తర్వాత .. సుకుమార్ వాట్ నెక్ట్స్‌..?

Amruth kumar
మూడేళ్ల పాటు పుష్ప 2  కోసం అలుపెరగని యోధుడిగా కష్టపడ్డాడు సుకుమార్ .. ఇప్పుడు ప్రేక్షకులు కూడా దానికి తగ్గిన ఫలితమే ఇచ్చారు .. పుష్ప 2 తర్వాత‌ సుకుమార్ ఏం చేస్తాడు ..? ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు..? అనే హ‌ట్‌ టాపిక్ ఇప్పుడు గట్టిగా నడుస్తుంది. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్‌తో సుకుమార్ ఓ సినిమా చేయాలని .. అయితే దానికి ఇంకాస్త టైం ఉంది .. సుకుమార్ దగ్గర కథ కూడా సిద్ధంగా లేదు.  ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు  .. ఇది  కంప్లీట్ అయ్యేలోగా సుకుమార్ కథ రెడీ చేసుకోవచ్చు కాబట్టి కావాల్సిన అంత టైం ఉంది.

ఈ లోపు సుకుమార్ చేయాల్సిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి .. దిల్ రాజు బ్యానర్ లో సేటిస్ పైకి వెళ్లిన సెల్ఫిష్ కు కొన్ని రిపేర్లు ఉన్నాయి సెకండ్ హాఫ్ లో కొంత గంథ‌ర గోళం కూడాంది. దానికి సుకుమార్ కూర్చుని సెట్ చేయాలని తెలుస్తుంది. దిల్ రాజు కూడా ఇదే విషయం గతంలో ఓ ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అలాగే సుకుమార్ రైటింగ్స్ లో రెండు సినిమాలు త్వరలో రాబోతున్నాయి .. వాటి కథ‌లు విని ఓకే చేయాలి సుకుమార్ ..

ఇక సుకుమార్ గత కొంతకాలంగా నడుము సంబంధిత నొప్పిలతో బాధపడుతున్నాడు .. అలాగే వాటికి ట్రీట్మెంట్ కూడా అవసరం త్వరలోనే సుకుమార్ అమెరికా వెళ్లే అవకాశం కూడా ఉంది .. అక్కడ నడుం నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటారని టాక్ .. అలాగే అమెరికాలో కొంతకాలం ఉండి కథపై అక్కడే కసరత్తులు చేస్తారని కూడా అంటున్నారు. ఇలా మొత్తానికి 2025 లో సుకుమార్ నుంచి కొత్త సినిమా మొదలయ్యే అవకాశం లేకపోవచ్చు .. అయితే ఆయన బ్యానర్లో మాత్రం కొన్ని సినిమాలు మొదలయ్యే అవకాశం మాత్రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: