ఏంటి అభిమానులకు భయపడి డైరెక్టర్ సుకుమార్ పుష్ప టు స్టోరీ పూర్తిగా మార్చేసారా.. ఇంతకీ పుష్ప 2 స్టోరీ మార్చాను అనడంలో ఉన్న సాక్ష్యం ఏంటి..ఈ న్యూస్ ఎందుకు వైరల్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న పుష్ప-2 సినిమా విడుదలైంది.ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించగా పుష్ప 1 కి సీక్వెల్ గా పుష్ప-2 వచ్చింది. అయితే దీనికి సీక్వల్ గా పుష్ప-3 కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే పుష్ప పార్ట్ వన్ లోనే తన నటనతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పుష్ప టు లో మరింత రెచ్చిపోయి నటించారు. ఈయన నటనకి అన్ని అవార్డులు ఈయనకే రావాలి అనేలా నటించారు.అయితే అలాంటి అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా స్టోరీ మార్చేశారు అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది.
అయితే ఈ వార్త వినిపించడానికి ప్రధాన కారణం గత సంవత్సరం అల్లు అర్జున్ కి సంబంధించి ఒక బ్లాక్ అండ్ వైట్లో ఉండే ఓ వీడియో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఆ వీడియోలో అల్లు అర్జున్ ముసుగు వేసుకొని ఆయనకి ఎదురుగా ఒక పులి వస్తుంది. వేరే ఈజ్ పుష్పా అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో అల్లు అర్జున్ తిరుపతి జైల్లో నుండి గాయలతో బయటపడినట్లుగా చూపించారు. అలాగే అల్లు అర్జున్ తను సంపాదించిన డబ్బు మొత్తాన్ని పేద ప్రజలకు పంచి పెట్టినట్టు కూడా ఒక సన్నివేశాన్ని చూపించారు. అయితే ఆ సన్నివేశాన్ని జనాలు కాస్త నెగిటివ్ గా చేసి నెగటివ్ ట్రోల్ చేశారు. అంతేకాదు తాజాగా విడుదలైన పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ ముసుగు వేసుకొని వచ్చిన సన్నివేశం ఎక్కడా కూడా కనిపించలేదు.
దాంతో ఫాన్స్ కి భయపడి సుకుమార్ స్టోరీ మొత్తం మార్చేశారు అని,ఇదే సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. అలాగే తాజాగా విడుదలైన పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ పోలీసులకు పెద్ద పెద్ద షాక్ లు ఇచ్చాడు. కానీ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ కి ఎక్కడా కూడా జలక్ ఇవ్వలేదు. కానీ పోలీసులు పుష్పరాజ్ కి జలక్ ఇచ్చినట్టు అప్పట్లో వీడియో రిలీజ్ చేసిన దాంట్లో చూపించారు. అయితే నెగిటివ్ కామెంట్లు వచ్చిన నేపథ్యంలోనే పుష్ప టు స్టోరీని సుకుమార్ మార్చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ముసుగు వేసుకొని వచ్చినా సన్నివేశం పుష్ప పార్ట్ 3లో ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. అలాగే దీనికి సంబంధించిన క్లారిటీ సుకుమార్ మూవీ ప్రమోషన్స్ లో బయట పెడతారేమో చూడాలి.