తరణ్ ఆదర్శ్: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ.. అవార్డులన్నీ బన్నీకే..కానీ ట్రిమ్‌ చేయాల్సిందే ?

Veldandi Saikiran
అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 ఇవాళ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.వాస్తవంగా నిన్న రాత్రి చాలా థియేటర్లలో తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్గా చేశారు. ఈ సినిమా మొదటి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ చేయగా రెండవ సినిమాలో... శ్రీ లీల ఐటెం సాంగ్ చేశారు.


అయితే నిన్న రాత్రి నుంచి థియేటర్లలో ఉన్న ఈ సినిమా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్లు చెబుతున్నారు ఫ్యాన్స్.చాలామంది అభిమానులు ఈ సినిమా బాగుందని.. రివ్యూ రేటింగ్ కూడా ఐదు పాయింట్లకు నాలుగు ఇస్తున్నారు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు సంపాదిస్తుందని చెబుతున్నారు. అయితే సోషల్ మీడియా స్టార్ తరుణ్ ఆదర్శ్ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. తరుణ్ ఆదర్స్ ఇచ్చిన రివ్యూ ప్రకారం ఈ సినిమాకు 4 స్టార్స్  కు పైగా ఇచ్చారు.

 

ఈ సినిమా లో హీరో అల్లు అర్జున్ యాక్టింగ్ అదరగొట్టాడని ఆయన రాసుకోచ్చారు. ఇండస్ట్రీలో... ఇలాంటి నటుడిని ఎక్కడ చూడలేదని కొనియాడారు.   ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపాడు. అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన యాక్టింగ్ కూడా అదరగొట్టిందని వివరించాడు. ఇక దర్శకత్వంలో సుకుమార్ను మించినవాడు ఎవరూ లేరని... వెల్లడించాడు తరుణ్.

అయితే ఈ సినిమా.. మూడు గంటలకు పైగా ఉండడమే పెద్ద మైనస్ అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించాడు. ఇంత పెద్ద సినిమాను కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదని తెలిపాడు. మూడున్నర గంటలు ఉన్నాయి పుష్ప సినిమాను కాస్త ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తే బాగుండేదని వెల్లడించాడు.ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్‌ కు అన్ని అవార్డులు వస్తాయన్నారు.  ఇక ఇది తప్పితే ఈ సినిమా మొత్తం అద్భుతంగా ఉందని తరుణ్ ఆదర్శ్... రివ్యూ ఇచ్చేశాడు. ఇక చాలా తెలుగు అలాగే ఇంగ్లీష్ వెబ్సైట్స్... ఈ సినిమాకు మూడుకు పైగా రేటింగ్ ఇచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: