పుష్ప2 ఫైరా? ఫ్లవరా? బెనిఫిట్ షో టాక్ తో తేలిపోయిందిగా!

frame పుష్ప2 ఫైరా? ఫ్లవరా? బెనిఫిట్ షో టాక్ తో తేలిపోయిందిగా!

praveen
పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కడ చూసినా కూడా ఇదే నినాదం వినిపిస్తుంది. అభిమానులు అందరూ కూడా ఇప్పటికే థియేటర్ కు చేరుకుని సినిమా చూసేసారు. ఈ క్రమంలోనే ఇక బెనిఫిట్ షోలో వెళ్లిన అభిమానులు అందరూ కూడా అటు పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసి.. ఇక అదే మైకంలో బయటికి వచ్చేస్తూ ఉన్నారు. ఇదేం సినిమా రా బాబు మైండ్ లోనుండి పోవట్లేదు అనే కామెంట్  థియేటర్ నుండి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడి నోట నుంచి వినిపిస్తుంది..


 సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప అనే సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సౌత్ లో మాత్రమే కాదు ఇండియా వ్యాప్తంగా కూడా ఈ సినిమా సెన్సేషనల్ విక్టరీని అందుకుంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్  ఇక ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప-2 అనే టైటిల్ తో భారీ అంచనాల మధ్య రెండవ పార్ట్ తెరకేక్కింది. ఇక ఇటీవల డిసెంబర్ 5వ తేదీన సినిమా ఇప్పటికే బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి అన్న విషయం తెలిసిందే.


 దీంతో ఇక పుష్ప సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 టాక్ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరిస్తున్నారు. పుష్ప 2 ఫైరా లేకపోతే ఫ్లవరా అని విషయం అర్థమయిపోయింది.

ఏమాత్రం ఫ్లవర్ కాదు ఫైర్.  అల్లు అర్జున్ అదరగొట్టేసాడు. బన్నీ నటనలో ఫైర్ చూపించాడు. సుకుమార్ క్రియేటివిటీలో ఫైర్ చూపించాడు. రష్మిక నటనతో పాటు రొమాన్స్లో ఫైర్ చూపించింది. శ్రీలల తన అదిరిపోయే స్టెప్పులతో కిసిక్ కంటూ ఫైర్ చూపించింది. దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఫైర్ చూపించాడు. ఇలా ఎవరికి వారు ఫైర్ చూపించడంతో పుష్ప 2 సినిమా మామూలు ఫైర్ కాదు ప్రీమియర్ షోలు అలా ముగిసాయో లేదో యునానమస్ గా వైల్డ్ ఫైర్ అనే టాక్ తెచ్చుకుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా సులువుగా మొదలై హై ఎండ్ తో ముగుస్తుంది. అరాచకానికి హద్దులు లేకుండా పోయాయి. బెనిఫిట్ షో తోనే అందరి నోళ్లు మూతపడ్డాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ కాదు ఏకంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అనే లాగే కనిపిస్తుంది?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: