
రాజమౌళి సుకుమార్ లలో ఎవరు గొప్ప.. ఆ దర్శకుడికే ఓటేసిన ఫ్యాన్స్..?
ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 త్రిబుల్ ఆర్ సినిమాలు ఇక వసూళ్లతో ఈ విషయాన్ని చెప్పకనే చెబుతూ వచ్చాయి అని చెప్పాలి. అయితే దర్శకుడు రాజమౌళి తర్వాత టాలీవుడ్ నుంచి ఆ రేంజ్ లో హిట్ సాధించిన దర్శకుడు ఎవరు అంటే సుకుమార్ అని చెప్పాలి. అల్లు అర్జున్ తో తీసిన పుష్ప సినిమా ఎంతటి సెన్సేషనల్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా విడుదలైన కొన్ని నెలల వరకు ప్రతి సినీ ప్రేక్షకుడికి పుష్ప ఫీవర్ పట్టుకుంది. ఒక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప-2 అనే మూవీ రిలీజ్ అయింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తవగా.. ఈ సినిమాకి కూడా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.
దీంతో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ హిట్స్ సాధించిన రాజమౌళి సుకుమార్లలో ఎవరు గొప్ప అనే చర్చ కూడా ఇండస్ట్రీలో మొదలైంది. అయితే ఇప్పటివరకు తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశం ఎల్లలు దాటించి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కచ్చితంగా దర్శకతీరుడు రాజమౌళికే చెందుతుంది. బాహుబలి 1 బాహుబలి 2 తెలుగులో సినిమాలు రాజమౌళి రేంజ్ ఏంటో భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాయి. రామ్ చరణ్,ఎన్టీఆర్ తో తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా ఏ స్థాయి హిట్ అయిందో చూశాం. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి నేషనల్ వేడిగా మంచి పేరు తెచ్చుకున్న తెలుగు దర్శకులలో రాజమౌళి ముందువరుసలో ఉండేవాడు. అయితే ఇప్పుడు పుష్ప వన్ తాజాగా పుష్ప 2 సినిమాలు చూసిన తర్వాత కచ్చితంగా సుకుమార్ కి కూడా రాజమౌళి సరసన చేరే అర్హత ఉందని ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. సుకుమార్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఓ పక్క కమర్షియల్ సినిమా తీస్తే బాక్సాఫీస్ దగ్గర మన గర్జన ఎలా ఉంటుందో చేసి చూపించాడు. ఇద్దరు గొప్ప డైరెక్టర్లే రాజమౌళితో పాటు సుకుమార్ కు కూడా ఓటు వేయవచ్చు. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎవరి స్టైల్ లో వారు గొప్ప అని చెప్పవచ్చు.