అల్లు అర్జున్ కి మొదటి పరీక్ష.. పుష్ప-2 హిట్టైతేనే?

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా పుష్ప-2 ఫీవర్ కొనసాగుతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంధపు చెక్కల స్మగ్లింగ్  నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది . అప్పటివరకు కేవలం సౌత్ లో మాత్రమే ఉన్న అల్లు అర్జున్ పాపులారిటీని ఇక ఇండియా మొత్తం వ్యాపించేలా చేసింది. అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా తిరిగిన పుష్ప-2 విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఏకంగా 50 దేశాలలో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది అన్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే ఇక పుష్ప-2 రిజల్ట్ అల్లు అర్జున్ కెరీర్ను నిర్ణయిస్తుంది అంటూ ఎంతో మంది సినీ విశ్లేషకులుఅంచనా వేస్తున్నారు. ఎందుకంటే పుష్ప సినిమా విజయం తర్వాత అల్లు అర్జున్ పై నెగిటివిటీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 కెరియర్ తొలినాళ్లల్లో మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పేర్లు చెప్పుకొని ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఫేమ్ రాగానే వాళ్లను మర్చిపోయారని.. వాళ్ల గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు అంటూ ఎంతోమంది మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి నెగెటివిటీ మధ్య ఇప్పుడు పుష్ప-2 సినిమా విడుదలవుతుంది. ఒకవేళ పుష్ప 2 సినిమా అనుకున్నట్లుగానే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అంటే అల్లు అర్జున్ కెరీర్ కు తిరుగే ఉండదని.. కానీ అలా కాకుండా ఏదైనా తేడా కొట్టి ఫ్లాప్ అయితే మాత్రం ఇక అల్లు అర్జున్ ను సైకలాజికల్ గా మరింత దెబ్బ కొట్టేందుకు.. మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో మరింత నెగెటివిటీని స్ప్రెడ్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా  పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత అల్లు అర్జున్ కు ఇదే మొదటిపరీక్ష అంటూ చెబుతున్నారు. మరిభారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: