సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సినిమాలలో హీరో ఎంట్రీలు చాలా త్వరగా జరుగుతూ ఉంటాయి. ఇక మరికొన్ని సినిమాలలో సినిమా ప్రారంభమైన చాలా సమయానికి హీరోల పాత్రలు వస్తూ ఉంటాయి. ఇకపోతే కొన్ని సినిమాలలో హీరో పాత్రలు ఫస్ట్ హాఫ్ లో చాలా తక్కువ కనిపించిన ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనా కూడా చివరగా సినిమా ఎలా ఉంది ... అది ఏ స్థాయి విజయాన్ని అందుకుంది అనేదే ప్రధమంగా మారుతూ ఉంటుంది. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో కమల్ హాసన్ ఒకరు.
ఈయన తెలుగు లో కూడా అనేక విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే కమల్ హాసన్ కొంత కాలం క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో మొదటి సగ భాగంలో కమల్ హాసన్ అత్యంత తక్కువ సమయం కనిపిస్తాడు. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత చాలా తక్కువ సమయానికి కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమా మొదటి భాగం చివరన కమల్ హాసన్ కనిపిస్తాడు.
దానితో ఈ సినిమా మొదటి భాగంల్ కమల్ హాసన్ కనిపించిన సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఈ సినిమా రెండవ భాగంలో మాత్రం కమల్ హాసన్ చాలా వరకు కనిపిస్తాడు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ కంటే ముందు కమల్ హాసన్ వరుస అపజయాలతో డీలాపడిపోయి ఉన్నాడు. కమల్ హాసన్ ఈ సినిమా విజయంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.