పుష్ప ఎఫెక్ట్ .. హైదారాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

MADDIBOINA AJAY KUMAR
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్ సందర్భంగా పోలీసులు హైదారాబాద్ లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే పార్ట్ వన్ హిట్ కొట్టడంతో ఈ సినిమా కోసం టాలీవుడ్ తో పాటు యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. దీంతో ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను తీసినట్టు సమాచారం.  డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన పుష్ప 2 పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగించేందుకు చిత్రయూనిట్ విభిన్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.
అయితే అల్లు అర్జున్, రష్మిక మందన్న మరియు ఫహద్ ఫాసిల్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్ లోకి రావడానికి వారం మాత్రమే సమయం ఉంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ మూవీ టీమ్ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. ప్రమోషన్లలో భాగంగా పుష్ప వైల్డ్ ఫైర్ జాతర అనే పేరుతో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిసెంబర్ 2 సాయంత్రం 6 గంటలకు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ పుష్ప ఈవెంట్ కు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ పోలీసులు ఆ ఏరియాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటు వైపు వచ్చే వాహనాల దారులను మళ్లిస్తూ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: