మెగా ఫ్యాన్స్‌కు షాక్.. రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో మట్కా స్ట్రీమింగ్!
మెగా అభిమానులకు ఇది ఒక విధంగా షాక్ అనే చెప్పాలి. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిసెంబర్ నెల 5వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అదే తేదీన నెట్ ఫ్లిక్స్ లో అమరన్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. మట్కా, అమరన్ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి. మట్కా మూవీ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. నాలుగు సౌత్ భాషలతో పాటు హిందీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మట్కా సినిమా నవంబర్ నెల 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కేవలం 2 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిందని సమాచారం అందుతోంది. మట్కా సినిమా కథ బాగానే ఉన్నా కథనం విషయంలో పొరపాట్లు చేయడం మైనస్ అయింది. వరుణ్ తేజ్ కెరీర్ పరంగా కొంతకాలం పాటు గ్యాప్ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.
వరుణ్ తేజ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. తొలిప్రేమ, ఫిదా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి మెప్పించాయి. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 7 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. వరుణ్ తేజ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. వరుణ్ తేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. వరుణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.